స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే….
జుక్కల్ ఆర్సీ సెప్టెంబర్ 30 ప్రశ్న ఆయుధం
మద్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో “స్వచ్ఛతా హి సేవ” పక్షోత్సవాల్లో భాగంగా మల్టీ పర్పస్ కార్మికులకు సన్మాన కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలు, మండల కేంద్రాల్లో ప్రతి నిత్యం చెత్తను తొలగిస్తూ, మురికి కాలువలను,రోడ్లను శుభ్రం చేస్తూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న పంచాయతీ కార్మికులను అభినందించారు.
కార్మికులు బాగుంటేనే సమాజం బాగుంటుందని అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహించిందని అసహనం వ్యక్తం చేశారు.
ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేస్తున్న కార్మికుల యొక్క ఆరోగ్యం పట్ల ప్రజా ప్రభుత్వం బాధ్యత తీసుకోవడమే గాక వారికి అన్ని రకాలుగా అండగా ఉంటుందని తెలిపారు.
అనంతరం గ్రామ పంచాయతీ కార్మికులకు ఐడి కార్డులు పంపిణీ చేశారు మరియు లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు.
ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు మరియు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, పంచాయతీ కార్మికులు, స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.
అనంతరం మద్నూర్ మండల కేంద్రంలో బీటీ రోడ్డు అభివృద్ధి పనులను పరిశీలించారు.