సహస్ర కు ఎమ్మెల్యే పోచారం అభినందనల వెల్లువ
ప్రశ్న ఆయుధం 02 మే ( బాన్సువాడ ప్రతినిధి )
బాన్సువాడ పట్టణంలోని వాసవీ హైస్కూల్ ఇటీవల వెలువడిన 10వ తరగతి ఫలితాలలో 600 మార్కులకు 576 మార్కులు సాధించి బాన్స్వాడ డివిజన్ టాపర్ గా నిలిచినందుకు రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఘనంగా సన్మానించారు.బాన్సువాడ డివిజన్ టాపర్ గా నిలవడం గర్వకారణం అని ఎమ్మెల్యే పోచారం కొనియాడారు.సహస్ర విజయాన్ని హర్షిస్తు వాసవీ హైస్కూల్ యాజమాన్యం సహస్ర కు 11000 వేల రూపాయలు బహుమతి ప్రకటించారు. ఈ కార్యక్రమములో పాఠశాల స్కూల్ యజమాన్యం మోటమర్రి నాగరాజు,రామకృష్ణ వాసవి స్కూల్ కరస్పాండెంట్ విజయ్ కుమార్ ,ప్రిన్సిపాల్ లక్ష్మీ శ్వేత ఉపాధ్యాయులు జలీల్, శ్రీనివాస్ నాగరాజు సహస్ర తల్లి తండ్రులు నరసింహులు రేఖ తదితరులు పాల్గొన్నారు.