బీసీ హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే పోచారం
ప్రశ్న ఆయుధం 13 జూలై ( బాన్సువాడ ప్రతినిధి)
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో గల బీసీ బాలికల హాస్టల్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముచ్చటిస్తూ వసతి గృహంలోని గదులను వంటశాల ను పరిశీలించారు.సమస్యలను అడిగి తెలుసుకున్నారు.గదుల కొరత ఉండడంతో హాస్టల్ పైన మరికొన్ని గదులు నిర్మించాలని విద్యార్థులు కోరారు.తమకు ఏ సమస్యలున్న మా దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే పోచారం తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట నాయకులు అంజిరెడ్డి కృష్ణారెడ్డి ఏజాజ్ మోహన్ నాయక్ నార్ల రవీందర్ రఘు మొహమ్మద్ గౌస్ తదితరులు ఉన్నారు.