*ఎస్ ఎస్ సి స్కూల్ టాపర్ అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన ఎర్రవార్ భవితకు ఎమ్మెల్యే పవర్ రామారావు పాటిల్ సన్మానం*
నిర్మల్,మే 07.
బైంసా పట్టణంలో ఎమ్మెల్యే పవర్ రామారావు పాటిల్ ఎస్ ఎస్ సి లో స్కూల్లో అత్యధిక మార్కులతో టాపర్గా నిలిచిన ఎర్రవార్ భవిత ను అభినందిస్తూ భవిష్యత్తులో చదువులో ఎప్పుడు టాపర్ గా ఉండాలని దీవిస్తూ మోమెంటో మరియు సర్టిఫికెట్ ప్రధానం చేసి ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా భవిత మాట్లాడుతూ ఈ సన్మానాలతో తనపై మరింత బాధ్యత పెరిగిందని భవిష్యత్తులో అన్ని చదువుల్లో టాపర్ గా ఉంటూ కన్న తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులకు, ఉన్న ఊరుకు ఘనమైన పేరు తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో భవిత తండ్రి ఎర్రవార్ రాజేష్ మరియు నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రభులింగం పాల్గొనడం జరిగింది.