ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వినతి *ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల జడ్పిటిసి,ఎంపీటీసీల* *సమస్య*

ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోండి*
*బొమ్మెర శ్రీనివాస్ కోరారు*
ప్రశ్న ఆయుధం న్యూస్ జూలై 26 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు స్థానిక జడ్పిటిసి,ఎంపీటీసీ రిజర్వేషన్ 2025 స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ లో అమలు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవాలని షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ విన్నవించారు.
వైరా నియోజకవర్గశాసనసభ్యులు
రామదాసు నాయక్ కొత్తగూడెం నివాస గృహంలో శనివారం కలిశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీ కులాలకు రాజకీయపరమైన రిజర్వేషన్ ఎంపీటీసీ,జెడ్పిటిసిలు తొలగించి జనరల్ లో కలపడం వల్ల లక్షలాదిమంది ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా అన్యాయం,అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలకు అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని
నిలబెట్టుకోవాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ముఖ్యమంత్రి దృష్టికితీసుకపోతానని హామీ వచ్చినారు.ఈ సందర్భంగా
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి నాయకులు సలిగంటి కొమరయ్య,కండే రాములు,ఎనగంటి శ్రీనివాస్,కన్నం చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now