ఎమ్మెల్యే శంకర్ అంకుల్ ప్లీజ్..!

*ఎమ్మెల్యే శంకర్ అంకుల్ ప్లీజ్..!*

*షాద్ నగర్ పట్టణంలో కుక్కల బెడదపై చిన్నారుల వేడుకోలు*

*గుంపులు గుంపులుగా కాలనీల్లో కుక్కల స్వైర విహారంతో.. విద్యార్థుల గుండెల్లో భయం*

ఎమ్మెల్యే శంకర్ అంకుల్ మీకు నమస్కారం… మా పేరు లక్కాకుల రమ్య గాయత్రి రవళి మాది మల్లికార్జున కాలనీ శిశు మందిర్ పక్కన మా కాలనీలో కుక్కల బెడద ఎక్కువైంది.. మున్సిపాలిటీలో పల్సాలు ఫిర్యాదు చేసినా.. సిబ్బందికి చెప్పినా వినిపించుకోవడం లేదు. పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తే కుక్కలు వెంట పడుతున్నాయి.. మేము ఆడుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము చైతన్య స్కూల్లో 8వ తరగతి చదువుకుంటున్నాము. నా పేరు రమ్య గాయత్రి మా చెల్లెలు నారాయణ స్కూల్ లో ఐదో తరగతి చదువుకుంటున్నది. మేము స్కూలుకు పోయి వచ్చే లోపల ఏ కుక్క కరుస్తుందో మాకే తెలియదు అంకుల్ జర చూడండి అంకుల్ శంకరంకుల్ అంటూ ఇద్దరు చిన్నారులు ప్రాదేయపడుతున్నారు.

ఇటీవల కాలంలో కుక్కల బెడద ఎక్కువ మనుషులను కరుస్తున్న ఘటనలు తరచూ కంటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వారం కిందట రైతు కాలనీలో ఐదేళ్ల పాప మినిను కుక్కలు పరిగెత్తించి మరి కరిచాయి. ప్రస్తుతం ఆ చిన్నారి కోరంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆయా కాలనీలలో కుక్కలు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. కుక్కల స్వైర విహారంతో రాత్రిపూట కాలనీలో పాదాచారులు నడవాలంటేనే భయపడుతున్నారు. పదుల సంఖ్యలో కుక్కలు మనుషులపై దాడులకు సిద్ధంగా ఉన్నాయి. మున్సిపాలిటీ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలి. బ్లూ క్రాస్ లాంటి సంస్థల వల్ల కుక్కలపై చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనుకంజ వేస్తున్న క్రమంలో కనీసం ప్రత్యామ్నాయ చర్యలైన తీసుకోవాలని ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు కోరుకుంటున్నారు. జంతువుల ప్రాణాలకు విలువనిచ్చే ఈ సమాజంలో మనుషుల ప్రాణాలకు కనీస విలువ లేదా అని చిన్నారులు సైతం పాలకులను ప్రశ్నిస్తున్నారు….

Join WhatsApp

Join Now