పలు గ్రామాలలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

*పలు గ్రామాలలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే*

గ్రామాలను అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యమని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం రోజున ఆయన మండలంలోని తలారివానిపల్లి, వడ్లూరు, బేగంపేట, నర్సింహులపల్లి, దేవక్కపల్లి గ్రామాలలో సీసీ రోడ్లు, అంగన్ వాడి భవనం, మహిళా సంఘ భవన ప్రహరీ నిర్మాణం, పలు అభివృద్ధి పనులకు కొబ్బరికాయ కొట్టి, పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్లు పులి సంతోష్, మచ్చ కుమార్, నాయకులు బైర సంతోష్, పోతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, జెల్ల ప్రభాకర్, అక్కరవేణి పోచయ్య, శానగొండ శరత్, పర్ష సంతోష్, రాసూరి మల్లికార్జున్, పులి రమేష్ గౌడ్, రాజేందర్, షాదిక్, సోషల్ మీడియా కన్వీనర్ కుంట హరికృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment