ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 18 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బాధిత కుటుంబాలను నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సున్నిత లక్ష్మారెడ్డి పరామర్శించారు. వారి ఇళ్ల వద్దకు వెళ్లి వారి కుటుంబాలను ఓదార్చి రగడపా సానుభూతిని తెలిపారు. బీఆర్ఎస్ భావిత కుటుంబాలకు అండగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు బీజేపీ నాయకుల పరామర్శ
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరిక పల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో బాధిత కుటుంబాలను బీజేపీ నాయకులు శుక్రవారం పరామర్శించారు. ఎంపీ రఘునందన్ రావు ఆదేశాల మేరకు గ్రామానికి చేరుకున్న బీజేపీ నాయకులు బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని బీజేపీ నాయకులు మల్లేష్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.