సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంపై టిడిపి నాయకులతో ఎమ్మెల్యే విజయ్ చంద్ర సమీక్ష. 

సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంపై టిడిపి నాయకులతో ఎమ్మెల్యే విజయ్ చంద్ర సమీక్ష.

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జులై 6( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు

పార్వతిపురం : పార్వతీపురం పట్టణంలో సుపరిపాలన తొలి అడుగు, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంపై పార్టీ నాయకులతో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర శనివారం ఉదయం సమీక్షించారు. పార్టీ కార్యాలయంలో పట్టణ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి గత మూడు రోజులుగా చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుండి వచ్చిన స్పందన, ప్రజలు ప్రస్తావించిన సమస్యలు, కూటమి ప్రభుత్వం పాలనపై ప్రజల అభిప్రాయం గురించి ఆరా తీశారు. ప్రజలు చెప్పే ప్రతి సమస్యను రికార్డు చేయాలని నాయకులకు సూచించారు. అలాగే మరింత చురుకుగా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి దూసుకెళ్లాలని నిర్దేశించారు. కాగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారని ప్రభుత్వ కార్యక్రమాల పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారని, టిడిపి నాయకులు ఎమ్మెల్యేకు వివరించారు. ప్రజల ఆశలకు అనుగుణంగా మనం ముందుకు సాగాల్సి ఉందని అందరితోనూ సయోధ్యగా నడుచుకోవాలని ఎమ్మెల్యే నాయకులుకు సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment