*మంత్రి పొన్నం ప్రభాకర్ కి హుజురాబాద్ నియోజకవర్గానికి నిధుల మంజూరు చేయాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వినతి*
*జమ్మికుంట /హుజురాబాద్ ప్రశ్న ఆయుధం ఆగస్టు 2*
హుజురాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ బస్టాండ్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం రూ . 2 కోట్ల రూపాయల నిధులు వెంటనే మంజూరి చేయాల్సిందిగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం మంత్రి ఛాంబర్ లో కలిసి వినతి పత్రం అందజేశారు తరచూ మంత్రి పొన్నం ప్రభాకర్ పై విమర్శలు గుప్పించే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మంత్రి చాంబర్ కు వెళ్లి స్వయంగా కలిసి ముచ్చటించి నియోజకవర్గం అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరు కోసం వినతి పత్రం ఇవ్వడంతో హుజురాబాద్ నియోజకవర్గంలో చర్చనీయంగా మారింది