కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే..
కామారెడ్డి జిల్లా పిట్లం
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 29:
పిట్లం మండలంలోని రాంపూర్, మద్దెల్ చెరువు గ్రామాలలో పార్టీ నాయకులను పరామర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రాంపూర్ గ్రామంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ బలరాం రెడ్డి తండ్రి కిష్ట రెడ్డి ఈ నెల 24వ తేదీన మరణించారు. మద్దెల్ చెరువు గ్రామ అధ్యక్షుడు గంగారం తల్లి రాజా బోయిన గంగవ్వ ఇటీవల మరణించారు. విషయం తెలుసుకుని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మంగళవారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వరితో పాటు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.