గాంధారి మండలంలో భూ కబ్జాదారులకు ఎమ్మెల్యే హెచ్చరిక

గాంధారి మండలంలో భూ కబ్జాదారులకు ఎమ్మెల్యే హెచ్చరిక

పేదల భూములను ఆక్రమించిన వారిని వదిలిపెట్టేది లేదు – ఎమ్మెల్యే

కబ్జా చేసిన భూములను తిరిగి పేదలకు అందజేస్తా – మదన్ మోహన్

ప్రజల ఆస్తులపై కన్నేసినవారికి కఠిన చర్యలు తప్పవు

ప్రభుత్వం పేదల పక్షాన నిలుస్తుంది

భూమి కోసం పోరాడుతున్న వారితో ఐక్యంగా ఉంటానన్నారు

గాంధారి, ఆగస్టు 21 (ప్రశ్న ఆయుధం):

గాంధారి మండల పరిధిలో భూ కబ్జాదారులపై కఠినంగా వ్యవహరిస్తామని స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ స్పష్టం చేశారు. పేదల సొమ్ము, భూములను ఆక్రమించిన వారిని ఏ పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే ఆక్రమణకు గురైన భూములను గుర్తించి తిరిగి పేదలకు అందజేసే చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ప్రజల ఆస్తులపై కన్నేసిన వారికి చట్టపరమైన చర్యలు తప్పవని ఎమ్మెల్యే స్పష్టంచేశారు. పేదల పక్షాన ప్రభుత్వం అండగా ఉందని, భూమి కోసం పోరాడుతున్న బాధితులతో ఐక్యంగా ఉంటానని మదన్ మోహన్ భరోసా ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment