శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే

*శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే*

మండల పరిధిలోని సుంకిశాల గ్రామంలో గురువారం శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యేని ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ మెంబర్లు సాదరంగా ఆహ్వానించారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన అనంతరం మండల పరిధిలోని వివిధ కార్యక్రమాలకు హాజరై వలిగొండ మండల పరిధిలోని సంగెం గ్రామంలో గల భీమ లింగేశ్వర స్వామి శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెడ్లరేపాక గ్రామపంచాయతీ శివారులో గల మనిగండ్ల గుట్ట ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే గురుకుల విద్యాలయాలకు ఒకే చోట చేర్చే విధంగా నిర్మించ తలపెట్టే ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనాలు నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. చౌటుప్పల్ ఆర్డీవో వలిగొండ ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment