సాధారణ మహిళగా కూరగాయలు కొనుగోలు చేసిన ఎమ్మెల్యే..

*సాధారణ మహిళగా కూరగాయలు కొనుగోలు చేసిన ఎమ్మెల్యే..*

అమ్మా ఎలా ఉన్నారు అంటూ ఆప్యాయంగా ప్రేమగా చిరునవ్వుతో పలుకరించినా ఎమ్మెల్యే..*

పాలకుర్తి నుండి జనగామ వెళ్లే మార్గంలో కోలుకొండ వద్ద ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సాధారణ మహిళగా కూరగాయలు కొనుగోలు చేశారు.

మార్గమధ్యంలో కూరగాయలు అమ్ముతున్న మహిళను చూసి కారును ఆపి, మాట్లాడుతూ కూరగాయలు కొనుగోలు చేశారు. *”మంచిగా ఉన్నాయి, నేను ఎరిస్తా…. బిడ్డా.. అంటూ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి* కి కూరగాయలు అమ్మారు.

ఎమ్మెల్యే యశస్విని కూడా సాధారణ గృహిణిలా మాట్లాడారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, తన కుటుంబ బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వహిస్తున్న ఆమె నడవడిని చూసిన వారు ఆశ్చర్యపోయారు..

ఈ దృశ్యాలు అక్కడి ప్రయాణికులను,చూపరులను ఆకట్టుకున్నాయి.

Join WhatsApp

Join Now