అమృత నగర్ తండా వాసులను పరామర్శించిన…ఎమ్మెల్యే
మాధవరం కృష్ణారావు
ప్రశ్న ఆయుధం ఆగస్టు 07: కూకట్‌పల్లి ప్రతినిధి
గురువారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ ఇటీవల వరద ప్రభావానికి గురైన అమృత నగర్ తండావాసులు ఆశ్రయం పొందుతున్న కేపిహెచ్బిలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లి పరామర్శించి ఏదైతే కలెక్టర్ డీసీ కి, సంబంధిత రెవెన్యూ అధికారులకు అమృత నగర్ తండా లోని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారిని పరిశీలించి ఒక నివేదిక ఇమ్మనడం జరిగిందని దీనికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కలెక్టర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ త్వరితగతిన నిరుపేదలను ఆదుకునేటట్లు చూడాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అందరూ కూడా ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు.