గానుగ నూనెవిధానాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

“GK COLD PRESSED OIL EXPELLER” షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరేఖపూడి గాంధీ మరియు రాగం నాగేందర్ యాదవ్ 

 

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 09: 

శేరిలింగంపల్లి ప్రతినిధి 

 

శేరిలింగంపల్లి డివిజన్ లోగల తారానగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన “GK COLD PRESSED OIL EXPELLER” షాప్ ను నిర్వాహకుల ఆహ్వానానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేఖపూడి గాంధీ , శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అనంతరం రిబ్బన్ కట్టింగ్ చేసి, జ్యోతి ప్రజ్వలించి షాపును ప్రారంభించారు. షాప్ యాజమాన్యులు ఎమ్మెల్యే కార్పొరేటర్ర్లకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా గానుగ నూనెలు తయారీ విధానాన్ని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ..కస్టమర్లకు స్వచ్ఛమైన గానుగ నూనెలను అందించాలని సూచించారు. స్వయం ఉపాధి మార్గం ఎంచుకున్నందుకు షాప్ నిర్వాహకులు కవిత గోపాల కృష్ణ లను అభినందించారు. స్థానిక ప్రజలు గానుగ నూనెలు షాప్ ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, యాదగిరి, బుచ్చయ్య, రాంచందర్, గోవింద్ చారీ, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, గోపాల్ యాదవ్, నటరాజ్, రాంచందర్ మరియు నిర్వాహకుల కుటుంబ సభ్యులు సూరజ్, శ్రీలేఖ, రిగ్ధశ్రీ, శ్రీ తీర్థ, ప్రాధ్యుమన్, మంజుల, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now