Site icon PRASHNA AYUDHAM

నియోజకవర్గంలో తనిఖీలు చేసిన ఎమ్మెల్యే

IMG 20241017 WA0360

కామరెడ్డి నియోజకవర్గంలో తనిఖీలు చేసిన ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి

ప్రశ్న ఆయుధం, అక్టోబర్ 17, కామారెడ్డి:

కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ప్రార్ధన సమయానికంటే ముందే వెళ్లి తరగతి గదులను పరిశీలించి ఉపాధ్యాయులు , విద్యార్థులతో మాట్లాడారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఉగ్రవాయి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను, బిబిపేట్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలను తనిఖీ చేశారు. మొత్తానికి ఎమ్మెల్యే కామారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాల్లో తనిఖీలు నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడారు. పలు పాఠశాలలలో పరిశుభ్రతతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన, మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని ఆయన సూచించారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు గ్రామస్థులు పాల్గొన్నారు.

Exit mobile version