
చండ్రుగొండ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసిస్తున్న గ్రామస్తులు వారికిచ్చిన ఇళ్లు వర్షాలకు కురుస్తూ శిథిలావస్థకు చేరుకుంటున్నాయని, స్లాబ్ పెచ్చులుడుతున్నాయని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కి తెలియజేసి దరఖాస్తు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మరమ్మత్తులు చేపించి ఇబ్బందు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు
అలాగే ఎస్సీ కాలనీలో స్మశాన వాటికకు దారి లేక ఇబ్బందులకు గురవుతున్నారని స్థానిక కాంగ్రెస్ నాయకులు ద్వారా తెలుసుకొని స్మశాన వాటికను పరిశీలించి త్వరలోనే స్మశాన వాటికకు రోడ్డు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు…