శ్రీవెన్ ఎంక్లేవ్ పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే

*శ్రీవెన్ ఎంక్లేవ్ పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే*

*ప్రశ్న ఆయుధం ఫిబ్రవరి 02:కుత్బుల్లాపూర్ ప్రతినిధి*

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 – గాజులరామారం డివిజన్ శ్రీవెన్ ఎంక్లేవ్ లో సుందరీకరించిన పార్క్ -1,2,3 లను ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…కాలనీ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు కాలనీలోని పార్కులకు నిధులు కేటాయించి అభివృద్ధి పరచామని రానున్న రోజుల్లో కూడా కాలనీలో మౌలిక వసతుల కల్పనకు చేస్తానని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ కాలనీవాసులతో వాలీబాల్ ఆడుతూ అలరించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కార్పొరేటర్ రావుల శేషగిరి, పాక్స్ డైరెక్టర్ పరిశే శ్రీనివాస్ యాదవ్, మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ నాగరాజు యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, నాయకులు చెట్ల వెంకటేష్, ఆసిఫ్, ప్రసాద్, శ్రీ వెన్ ఎంక్లేవ్ అధ్యక్షులు అనంతం రంగా రావు, ప్రధాన కార్యదర్శి సాజిద్ హుస్సేన్, కోశాధికారి గంగాధర్ రెడ్డి, సభ్యులు ప్రదీప్ రెడ్డి, గోపి కుమార్, ఎస్. శ్రీనివాస్ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment