Site icon PRASHNA AYUDHAM

అచ్చంపేట మండలం చంద్రసాగర్ నుండి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

అచ్చంపేట మండలం చంద్రసాగర్ నుండి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

నాగర్ కర్నూల్ జిల్లా:

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం చంద్రసాగర్ రిజర్వాయర్ నుండి రబీ సీజన్ పంటకు అవసరమయ్యే సాగునీటిని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ

చంద్ర సాగర్ ఉన్నటువంటి ఆయకట్టు 1200 ఎకరాల ఆయకట్టు మరొక 3 00 రాల ఆయకట్టు పెరగడం జరిగిందని,ఈరోజు చంద్ర సాగర్ నుండి సాగునీటిని సంబంధిత ఇరిగేషన్ శాఖ , స్థానిక ప్రజాప్రతితులు కలిసి అధికారులతో నీటిని విడుదల చేశారు.చంద్రసాగర్ కాలువలకు కొన్ని చోట్ల మరమతులు చేయాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన ప్రతిపాదనలు ఇరిగేషన్ శాఖ అధికారులు సిద్ధం చేశారని,త్వరలో ఇరిగేషన్ శాఖ మంత్రి తో మాట్లాడి నిధులు కేటాయించి కాల్వలను కూడా మరమ్మత్తు చేయడం జరుగుతుందని అన్నారు. శ్రీశైలం ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ చంద్ర సాగర్ ను పర్యాటక ప్రాంతంగా మార్చాదానికి కృషి చేస్తామని చంద్ర సాగర్ లో గత కొన్ని రోజుల క్రితం చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందని,దీని ద్వారా మత్స్యకారులు సొసైటీలు లబ్ధి పొందే అవకాశం ఉంటుందని అన్నారు.

త్వరలోనే నియోజకవర్గానికి సాగునీటి ప్రాజెక్టులు శంకుస్థాపనలు చేయడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డి ఈ, బాలస్వామి, ఏఈ రమేష్, ఇరిగేషన్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, విజయ డైరీ చైర్మన్ నర్సయ్యా యాదవ్, మాజీ ఎంపీపీ రామనాథం , మంత్రియనాయక్, కాశన్న యాదవ్, అభి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Exit mobile version