పాలకుర్తి ఆర్టీసీ బస్టాండ్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే యశస్విని..

*పాలకుర్తి ఆర్టీసీ బస్టాండ్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే యశస్విని..*

*జనగామ జిల్లా:*

*పాలకుర్తి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను పాలకుర్తి శాసన సభ్యురాలు మామీడాల యశస్విని రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.* బస్టాండ్‌లో ఉన్న వాస్తవ పరిస్థితులను పరిశీలించిన వారు అక్కడి పరిసరాలను కూడా సందర్శించారు.అనంతరం ప్రయాణికులతో ముఖాముఖి మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సౌకర్యాల లోపాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా పలువురు ప్రయాణికులు తాగునీరు సౌకర్యం లేకపోవడాన్ని, భద్రతా పరికరాలు లేకుండటాన్ని, కాంపౌండ్ వాల్ లేదంటూ గోడులేని స్థితిని ఎమ్మెల్యే గారికి వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించేందుకు బస్టాండ్‌లో తగిన సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటామని,త్వరలోనే పాలకుర్తి ఆర్టీసీ బస్టాండ్‌లో తాగునీటి సౌకర్యం, సీసీ కెమెరాలు, కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపడతామని,అలాగే, బస్టాండ్ పరిసరాల్లో పారిశుధ్య పరిరక్షణకూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించి ప్రయాణికుల సౌకర్యమే ప్రభుత్వ ప్రాధాన్యతని, ప్రజల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ తనిఖీ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఆర్టీసీ అధికారులు,పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now