Site icon PRASHNA AYUDHAM

ఏఐసిసి ఇంచార్జితో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీరెడ్డి భేటీ..

IMG 20250424 WA2203

*ఏఐసిసి ఇంచార్జితో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీరెడ్డి భేటీ..*

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసిసి) తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌ ను పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను మీనాక్షి నటరాజన్‌కు వివరించారు. అలాగే పార్టీ నిర్మాణం, స్థానిక రాజకీయ పరిస్థితులు, బూత్ స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలను గురించి వారితో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి,పార్టీ ఇంచార్జి ఝాన్సీరెడ్డి చర్చించగా సానుకూలంగా స్పందించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీపీ, జెడ్పీటీసీ,అన్ని గ్రామాల్లో సర్పంచ్ స్థానాలను మన పార్టీ క్లీన్ స్వీప్ చేయడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

Exit mobile version