సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో పని చేస్తున్న మరియు కాంట్రాక్ట్ బేసిస్ లో పని చేస్తున్న ఉద్యోగులకు. పూజారులకు, కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ కల్పించాలని దేవాదాయ శాఖ కమిషనర్ కు ఎమ్మెల్సీ డాక్టర్ సి.అంజిరెడ్డి వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన, ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి యోజన ఎస్ బీఐ లైఫ్, వారి రక్షణ కోసం ఇతర ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే హిందూ దేవాలయాల్లో టికెట్ ధరల్లోనే దేవాదాయ పరిసరాల్లో ఉన్న భక్తులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి పేర్కొన్నారు.
దేవాదాయ శాఖ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి
Oplus_0