*మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్*
*జమ్మికుంట ఫిబ్రవరి 20 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన పాత్రికేయుడు అయిత రాధాకృష్ణ మాతృమూర్తి అయిత రాజ్యలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను గురువారం రోజున ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతురాలు రాజ్యలక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వెంకట్ మాట్లాడుతూ రాజ్యలక్ష్మి మరణం కుటుంబాన్ని తీరని లోటని రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు అండగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కసుబోజుల వెంకన్న, ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, ఎండి సలీం, ఫాషా, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి సలీం, ఎగ్గని శ్రీనివాస్, రాకేష్ ఉమ్మడి సందీప్ చిన్నాల శ్రీకాంత్ యాదవ్ మాధవరావు తదితరులు పాల్గొన్నారు.