*ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఇంటింటికి ప్రచారం*
*జమ్మికుంట ఫిబ్రవరి 22 ప్రశ్న ఆయుధం*
ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో పట్టభద్రుల ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మార్కెట్ డైరెక్టర్ ఎగ్గేటి సదానందం, హుజురాబాద్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చెన్నవేన రమేష్, మండల ప్రధాన కార్యదర్శి మ్యాకమల్ల అశోక్ యువజన నాయకులు రామిడి సూర్య తేజరెడ్డి తదితరులు పాల్గొన్నారు.