ఆశీర్వదించండి… అండగా ఉంటా.. హరికృష్ణ

ఆశీర్వదించండి
Headlines in Telugu:
  • పట్టభద్రుల కోసం ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ బాన్సువాడలో ఆత్మీయ సమ్మేళనం
  • విద్యావేత్తగా చట్టసభల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రసన్న హరికృష్ణ ప్రకటన
  • పట్టభద్రుల ఓటరు నమోదు కోసం తుది తేదీ పెంచాలని కోరిన ఎమ్మెల్సీ అభ్యర్థి

*ఆశీర్వదించండి..అండగా ఉంటా*

*ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ*

ప్రశ్న ఆయుధం 03 నవంబర్(బాన్సువాడ ప్రతినిధి)

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రసన్న హరికృష్ణ బాన్సువాడ పట్టణములోని తారాచంద్ ఫంక్షన్ హాల్ లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…ఒక విద్యావేత్తగా ఒక యువకునిగా 19 సంవత్సరాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఇంకా ఉద్యోగ జీవితం ఉన్న తన ఉద్యోగానికి రాజీనామా చేసి చట్ట సభల్లో నిరుద్యోగ ఉద్యోగ ఉపాధ్యాయ గొంతుకగా తన వాణి వినిపిస్తానని తెలిపారు.ఒక విద్యావేత్త చట్టసభల్లో ఉంటే విధ్యా చట్టాలను తయారు చేయొచ్చు అని,ప్రభుత్వానికి నిరుద్యోగులకు వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.కోచింగ్ సెంటర్ల ద్వారా ఎంతో మంది విద్యార్థులకు కోచింగ్ ఇప్పించి వారు ఉద్యోగాలు సాధించేలా కృషి చేశామన్నారు.తాను గెలిస్తే ప్రతి మండల కేంద్రములో ఒక లైబ్రరీ ఏర్పాటు చేసి,నిరుద్యోగులకు బాసటగా నిలుస్తానని ఆయన తెలిపారు.తాను అక్షరాన్ని నమ్ముకున్న వ్యక్తిని అని,అక్షరం ద్వారా సమాజం మార్చవచ్చని, అక్షరం ద్వారా వ్యక్తి జీవితంలో మార్పు సాధించవచ్చని పేర్కొన్నారు.శాసన మండలి పవిత్రమైనదని,రాజకీయ నిరుద్యోగులకు ఆవాసం కాకూడదని విద్యావేత్తలకు, సామాజిక వేత్తలకు, వివిధ రంగాల నిష్ణాతులైన వ్యక్తులకు నిలయంగా ఉండాలని ఆకాంక్షించారు.ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియ చివరి తేది ఈ నెల 6 వరకు ఉన్నందున దయచేసి పట్టభద్రులందరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు.ఇంకా 20 శాతం మంది మాత్రమే నమోదు చేసుకున్నందున ఇంకా చివరి తేది పెంచేలా ఎలక్షన్ కమిషన్ ను కోరుతానని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టభద్రులు ప్రసన్న హరికృష్ణ బృందం తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now