బిజెపి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ సంబరాలు
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
బీజేపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉపాద్యాయ నియోజకవర్గంలో మొదటి ప్రాధాన్యత ఓటు తోనే విజయం సాధించిన బీజేపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా లో టపాకాయలు కాల్చి, మిఠాయిలు తినిపించుకుని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ మార్పు మొదలయిందని, ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా బీజేపీ అభ్యర్థులు గెలుస్తారని జోస్యం చెప్పారు. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తున్నారని అన్నారు. మల్క కొమురయ్య గెలుపు కాంగ్రెస్ ప్రభుత్వనికి చెంప పెట్టు లాంటిది అని అన్నారు. ఉపాద్యాయ ఎమ్మెల్సీ మాత్రమే కాకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ బలపరిచిన అంజిరెడ్డి విజయం సాధించడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇద్దరు అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి తో పాటు బీజేపీ కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధనకార్యదర్శి నరేందర్ రెడ్డి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ విపుల్, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, నాయకులు నరేందర్, రవీందర్, విజయ్, రాజు, వేణు, రఘు, ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.