సంగారెడ్డి/పటాన్ చెరు, నవంబరు 8 (ప్రశ్న ఆయుధం న్యూస్): పేదలకు సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని ఎమ్మెల్సీ డా.చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ గ్రామానికి చెందిన పడాల రాజశేఖర్ కు ఎమ్మెల్సీ అంజిరెడ్డి చొరవతో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.24వేల చెక్కును శనివారం ఆయన స్వగృహంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పేదల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామని తెలిపారు.
పేదలకు అండగా సీఎం సహాయనిధి: ఎమ్మెల్సీ డా.చిన్నమైల్ అంజిరెడ్డి
Oplus_16908288