ఎం ఎల్ సి కవితకు బెయిల్ మంజూరి పట్ల హర్షం
న్యాయ వ్యవస్థ పై నమ్మకాన్ని పెంచిన సుప్రీంకోర్టు
గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్
గజ్వేల్ ఆగస్టు 27 ప్రశ్న ఆయుధం :
రాజకీయ ప్రేరేపితమైన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎం ఎల్ సి కవితకు బెయిల్ మంజూరి చేయడం పట్ల గజ్వెల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయవ్యవస్థలపై నమ్మకం పెంచే విధంగా బెయిల్ మంజూరు చేసిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలపై రాజకీయ కక్ష సాధించేందుకు ఈడీ,సీబీఐ లాంటి కేంద్రప్రభుత్వ సంస్థల్ని ఉసిగొల్పి ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసి వారిని లొంగదీసుకోవాలని ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఎన్ని కుట్రలు ప్రయోగించినా ఎక్కడా వెరవకుండా పోరాటాన్ని కొనసాగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలోనే కవితను అరెస్ట్ చేశారని,5 నెలల పాటు జైల్లో ఉంచినా కూడా వెరవకుండా న్యాయవ్యవస్థలపై నమ్మకంతో న్యాయ పోరాటం సాగించడం వల్ల ఈరోజు సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరి చేసిందని అన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ పోరాట పునాధుల మీద పుట్టిన పార్టీ అని ఎన్ని ఇబ్బందులు కుట్రలు ప్రయోగించినా ధైర్యంగా ఎదుర్కొని కొట్లాడే ధైర్యం దమ్ము బి ఆర్ ఎస్ పార్టీ నాయకులకు ఉన్నాయని తప్పకుండా ప్రజలకిచ్చిన వాగ్దానాలన్ని ఆమలు చేసే దాకా మడమ తిప్పకుండా పోరాటం కొనసాగిస్తామన్నారు.