*హరీష్ రావుపై రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ కేసులు. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి*
మెదక్ జిల్లా
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతూ, అనునిత్యం ప్రజల కోసం పరితపిస్తూ,ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న మాజీ మంత్రి ఉద్యమ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరిశరావుపై అక్రమ కేసులు పెడుతున్నారని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఖండించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన
కేసులకు భయపడే నాయకుడు హరీష్ రావు కాదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు రైతులకు ఇచ్చిన హామీలు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ,రైతు భరోసాను అమలు చేయకుండా మాట తప్పారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను చీల్చి చెండాతున్న మాజీ మంత్రి హరీశ్ రావు ప్రజల పక్షాన మాట్లాతున్నందున ఈఅక్రమ కేసులు బనాయించి భయ బ్రాంతులకు గురి చేస్తే భయపడే ప్రసక్తే లేదన్నారు. జైలులో పెట్టాలని చూస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని ఆయన హెచ్చరించారు.ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజలే హరీష్ రావును కాపాడుకుంటారన్నారు. ప్రభుత్వం ఎంత అణగదొక్కాలని చుస్తే అంత ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.