ఎం ఎల్ సి.తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలని

*ఎం ఎల్ సి.తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలని*

*కొడిమ్యాల మండల రెడ్డి సంఘం ప్రతినిధులు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు*

కొడిమ్యాలఫిబ్రవరి 06.

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సై సందీప్ కి తీన్మార్ మల్లన్న పై కోడిమ్యాల మండల రెడ్డి సంఘం ప్రతినిధులు గురువారం ఫిర్యాదు చేశారు.కులం పేరు పెట్టి దూషించిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న పై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గత కొద్దికాలం నుండి రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడడం జరిగింది తన రాజకీయ లబ్ధి కోసం ప్రత్యేకంగా రెడ్డి సామాజిక వర్గంపై ఇష్టరాజ్యాంగా మాట్లాడిన ఘటన పై విచారణ జరిపి తీన్మార్ మల్లన్న పై చట్టపరమైన చర్య తీసుకోవాలని మండల రెడ్డి సంఘం ప్రతినిధులు డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల రెడ్డి సంఘం అధ్యక్షులు గడ్డం చంద్రమోహన్ రెడ్డి ఉపాధ్యక్షులు ఊట్కూరి మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మందల గోపాల్ రెడ్డి, కోశాధికారి పాశం కిషన్ రెడ్డి ,మండల రెడ్డి సంఘం ప్రతినిధులు సంధి రెడ్డి లక్ష్మారెడ్డి, సురు కంటి ముత్యం రెడ్డి, బండ లింగారెడ్డి, బండ నరసింహారెడ్డి, నోముల రాంరెడ్డి, గోగురి శేఖర్ రెడ్డి, ఎడమల జితేందర్ రెడ్డి, పిడుగు లక్ష్మారెడ్డి సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రెడ్డి ,గడ్డం లక్ష్మారెడ్డి,మారు జనార్దన్ రెడ్డి, సింగిరెడ్డి సురేందర్ రెడ్డి,ఊట్కూరి గోపాల్ రెడ్డి ,గుంటుకు లక్ష్మారెడ్డి, పరం సత్తిరెడ్డి, గుంటూకు రమేష్ రెడ్డి,రెడ్డి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now