మెదక్ లో ఈనెల 21న ఎమ్మెల్సీ ఓటర్ల సమావేశం: బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్

మెదక్/నర్సాపూర్, ఫిబ్రవరి 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఈ నెల 21న మెదక్ పట్టణ కేంద్రంలోని మాయ గార్డెన్ లో ఉదయం 10గంటలకు ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల సమావేశం నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నర్సాపూర్ అసెంబ్లీ ఇంచార్జ్ పాపగారి రమేష్ గౌడ్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావులు విచ్చేయనున్నారని అన్నారు. కావున ఈ సమావేశానికి జిల్లా నాయకులు, మండలాల అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్చార్జులు, మండల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇన్చార్జులు, మండల పదాధికారులు ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల ఓటర్లను తీసుకొని రావాలని కోరారు.

Join WhatsApp

Join Now