జూలై 7న ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి

జూలై 7న ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి.

ప్రశ్న ఆయుధం 04 జూలై ( బాన్సువాడ ప్రతినిధి)

బాన్సువాడ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఎమ్మార్పీఎస్ నాయకులు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు రుశేగాం భూమయ్య మాట్లాడుతూ…ఏబిసిడి వర్గీకరణ కోసం అలుపెరుగని పోరాటం చేసి అనేక ఉద్యమాలు పోరాటాలు ఆత్మబలిదానాలు వాళ్లనే వర్గీకరణ సాధ్యమైందని ఆయన తెలిపారు.జులై 7న ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా అధ్యక్షులు భూమయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కాశిరం జిల్లా కార్యదర్శి సురేష్ బాన్సువాడ నియోజకవర్గ కార్యదర్శి సాయిలు రాములు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment