పోతంగల్ కలాన్‌లో రైతులకు చైతన్యం..
తెగుళ్లు, వ్యాధుల నివారణ సూచనలు.
సోయాబీన్, వరి పంటల్లో కనిపిస్తున్న తెగుళ్లపై శాస్త్రీయంగా అవగాహన.
వ్యవసాయ అధికారి రాజలింగం, ఏఈఓలతో కలిసి పంట పొలాల్లో ప్రత్యక్షంగా పరిశీలన.
రైతులకు నియంత్రణ చర్యలపై స్పష్టమైన సూచనలు.
సమర్థవంతమైన వ్యవసాయ పద్ధతుల అవశ్యకతను సూచించిన అధికారులు.
రైతులు సంతృప్తి వ్యక్తం చేసిన శిక్షణ కార్యక్రమం,
కామారెడ్డి జిల్లా గాంధారి..(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 01:
గాంధారి మండలం పోతంగల్ కలాన్ గ్రామంలో వ్యవసాయ శాఅధికారి రాజలింగం ఆధ్వర్యంలో రైతులకు మేలైన చైతన్య కార్యక్రమం నిర్వహించారు. సోయాబీన్, వరి పంటల పొలాల్లో ఏఈఓలతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన, తెగుళ్లు, వ్యాధుల నివారణకు తగిన సూచనలు ఇచ్చారు.రైతులకు సరైన సమయానికి జాగ్రత్తలు తీసుకోవాలని, శాస్త్రీయ పద్ధతుల్లో మందుల వాడకాన్ని పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంతో రైతుల్లో అవగాహన పెరిగిందని గ్రామస్థులు తెలిపారు.