సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం వద్ద ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో విపత్తు నిర్వహణ ప్రణాళికలో భాగంగా గురువారం ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బిడిఎల్), రక్షణ మంత్రిత్వ శాఖ, తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక సేవల విభాగం సంయుక్తంగా ఈ డ్రిల్‌ను నిర్వహించాయి. అత్యవసర పరిస్థితుల్లో అగ్నిమాపక శాఖ, ఆసుపత్రి సేవలు, భద్రతా విభాగం మరియు సంబంధిత అధికారులు తక్షణ ప్రతిచర్య ఎలా చూపిస్తారన్నది తెలుసుకోవడం ఈ మాక్ డ్రిల్ ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. డ్రిల్‌లో భాగంగా ఆయిల్ ఫైర్, జనరల్ ఫైర్, ఎలక్ట్రికల్ ఫైర్ వంటి దృశ్యాలు సృష్టించి, వెంటనే రెస్క్యూ ఆపరేషన్లు, తరలింపు చర్యలు చేపట్టారు. అనంతరం సేఫ్టీ ఆఫీసర్ జి. చెన్నారెడ్డి, బిడిఎల్ ఫైర్ ఆఫీసర్ నాయుడు, తెలంగాణ ఫైర్ సర్వీసెస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. అగ్నిమాపక భద్రతా నియమాలు, అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామని అన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల నియంత్రణ, భద్రతా చర్యలలో సెక్యూరిటీ విభాగం చురుకుగా పాల్గొన్నారని తెలిపారు.
ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మాక్ డ్రిల్
Updated On: October 30, 2025 6:52 pm