Site icon PRASHNA AYUDHAM

దేవునిపల్లి జడ్పీహెచ్ఎస్‌లో మాక్ ఎన్నికలు

IMG 20251222 155959

దేవునిపల్లి జడ్పీహెచ్ఎస్‌లో మాక్ ఎన్నికలు

విద్యార్థులకు ప్రజాస్వామ్యంపై అవగాహన : 

తాజా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియా

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్‌ 22:

కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన మాక్ ఎలక్షన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాజా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు భారత ఎన్నికల విధానం, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సరళిపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజాస్వామ్యంలో ఓటు విలువను తెలియజేయడమే లక్ష్యంగా ఈ మాదిరి ఎన్నికలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. పాఠశాలలో గత నెల నోటిఫికేషన్ విడుదల చేయగా 52 మంది విద్యార్థులు నామినేషన్లు దాఖలు చేయగా, 12 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అనంతరం విద్యార్థుల చేతనే ఓటింగ్ నిర్వహించారు. ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల అధికారులు, సిబ్బంది పాత్రలను కూడా విద్యార్థులే నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులు గుగులోతు రాజు, అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో ఓటు పాత్ర ఎంత కీలకమో విద్యార్థులకు తెలియజేయడానికే ఈ మాక్ ఎలక్షన్స్ నిర్వహించామని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగా కిషన్ ఈ ఎన్నికల ప్రక్రియకు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తాజా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియా, చంద్రశేఖర్ రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్లు ఊదొండా రవి, పోలీసు కృష్ణాజీ రావు, చాట్ల వంశీ, సలీం, పిడుగు మమతా, సాయిబాబా, సుగుణ, మహేష్, పండు శ్రీకాంత్, పెద్దోళ్ల శశిధర్ రావు, కానకుంట గోవర్ధన్ రాజు పాటిల్, కాసర్ల రవీందర్, నిట్టు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయ బృందాన్ని అతిథులు అభినందించారు.

Exit mobile version