Site icon PRASHNA AYUDHAM

ఉత్తర భారతీయుల ఛఠ్ పూజ వేడుకల్లో పాల్గొన్న మాదిరి ప్రిథ్వీరాజ్

IMG 20251028 101613

Oplus_16908288

సంగారెడ్డి/పటాన్‌చెరు, అక్టోబర్ 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు కట్ట వద్ద మంగళవారం ఉదయం ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఛఠ్ పూజ ఉపవాస దీక్షల ముగింపు కార్యక్రమం భక్తి–శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాదిరి ప్రిథ్వీరాజ్ పాల్గొని సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు శాసన సభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, విజయ్, విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తర భారతీయ సమాజానికి చెందిన మహిళలు, పురుషులు కుటుంబ సమేతంగా హాజరై భక్తిశ్రద్ధలతో సూర్యారాధన చేశారు. సూర్యోదయం సమయంలో చెరువులో నీరాడి ఆరతులు సమర్పించారు.

Exit mobile version