రన్ ఫర్ యూనిటీ 2కె రన్‌లో పాల్గొన్న మాదిరి పృథ్వీరాజ్

సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారతదేశ ఐక్యతకు ప్రతీక, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన రాష్ట్రీయ ఏకతా దివస్ లో భాగంగా పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో జరిగిన 2కె రన్ ఫర్ యూనిటీ లో శుక్రవారం మాదిరి పృథ్వీరాజ్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ఐక్యతకు బలమైన పునాది వేసిన మహానాయకుడు సర్దార్ పటేల్ జీవితం ప్రతి ఒక్కరికీ ప్రేరణ.. ఆయన దూరదృష్టి, ధైర్యం, దేశభక్తి ఈ తరం నేర్చుకోవాల్సిన విలువలు అని మాదిరి ప్రిథ్వీరాజ్ పేర్కొన్నారు. ఐక్యతలోనే శక్తి, పటేల్ ఆత్మస్ఫూర్తి మనలో ఎప్పటికీ నిండుగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, సీఐ వినాయక రెడ్డి, మైత్రి క్రికెట్ క్లబ్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, పీఈటీ టీచర్లు, మార్నింగ్ వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment