Site icon PRASHNA AYUDHAM

ఆధునిక మణువే అమిత్ షా

IMG 20241219 WA0583

ఆధునిక మణువే అమిత్ షా..

అమీత్ షా దేశ ప్రజలలకు క్షమాపన చెప్పాలి..

డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి

గజ్వేల్ డిసెంబర్ 19 ప్రశ్న ఆయుధం :

పార్లమెంట్ లో అంబేడ్కర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గజ్వేల్ మండలం అనంతరావు పల్లిలో దళిత బహుజన ఫ్రంట్ అధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియచేసి అమీత్ షా దేశ ప్రజలకు క్షేమాపన చెప్పాలని డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరు ఏగొండ స్వామి డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఏగొండ స్వామి మాట్లాడుతూ పార్లమెంట్ లో అమీత్ షా మాట్లాడుతూ భీంరావు అంబేద్కర్ జీ పేరును తీసుకోవడం ఫ్యాషన్ అయింది.అంబేడ్కర్ పేరుకు బదులు దేవునుని స్మరిస్తే ఏడుతరాల స్వర్గం ప్రాప్తిస్ధది అని హేళన చేసే విధంగా మాట్లాడటం అంటే అంబేడ్కర్ పట్ల అంబేడ్కర్ వాదుల పట్ల బిజెపి వాళ్ళ నిజ స్వరూపం బయటపడిందన్నారు.అంబేడ్కర్ అంటే సమానత్వం, స్వేచ్ఛ మరియు సామాజిక మార్పు విప్లవానికి చిహ్నం హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన బాబా సాహెబ్ బడుగు,బలహీన వర్గాలకు అంబేద్కర్ చేసిన చారిత్రక సహకారాన్ని అవమానించారు అని అన్నారు. కానీ దళితులకు మరియు ఇతర నిర్లక్ష్యానికి గురైన వారికి, వారి ఏకైక దేవుడు బాబా సాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్, ఎవరి వల్ల ఈ తరగతులకు రాజ్యాంగంలో చట్టపరమైన హక్కులు లభించాయో, ఆ రోజునే ఈ తరగతులకు ఏడు జన్మల పాపాలు పటపంచాలయన్నారు. దేశంలోని ప్రజలందరు నిరసన వ్యక్తం చేస్తూ మానవాదుల నిజస్వారూపాన్ని తెలియచేస్తూ పెద్దెత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారన్నారు.అంబేడ్కర్ పట్ల అమీత్ షా కు ఏమత్రం గౌరవం ఉన్న క్షేమాపన చెప్పి చేసిన వ్యాక్యాలకు ప్రయాశ్చితం పొందలన్నారు.ఈ కార్యక్రమంలో కొటయ్య,రాజు,సామయ్య,రాజు,రిత్వీక్,బాబు,పిల్లలు పాల్గొన్నారు.

Exit mobile version