నారాయణఖేడ్ లో ముగిసిన మోదీ కప్ సీజన్-2 క్రికెట్ మ్యాచ్

*క్రీడాకారులకు బహుమతులు అందజేత*

సంగారెడ్డి/నారాయణఖేడ్, జనవరి 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): నారాయణఖేడ్ థెహసిల్ మైదానంలో రసవతారంగా సాగిన మోదీ కప్ సీజన్-2 ఫైనల్ క్రికెట్ మ్యాచ్ ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ శెట్కర్, ఎస్ఐ శ్రీశైలం, బస్వరాజ్, బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్‌రాజ్ శేరికార్ లు హాజరయ్యారు. గురువారం జరిగిన మ్యాచ్ లో బీఎస్ వీ/ వినయ టీంలు తలపడ్డాయి. ఇందులో విన్నర్ గా బీఎస్ వీ జట్టు 55,555 రూపాయల నగదు అందుకున్నారు. అదే విధంగా రన్నర్ వినయ టీం రూపాయలు 25,555 రూపాయల బహుమతి గెలుచుకున్నారు. హోరా హోరీగా నడిచిన క్రికెట్ మ్యాచ్ చూడటానికి యువ క్రీడా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా ఈ మ్యాచ్ స్పాన్సర్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ కు క్రీడాకారులు ధాన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, మాణిక్, రాజశేఖర్ గౌడ్, దశరథ్, ముజామిల్, సద్దాం తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now