ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు మోడీ కానుక

*ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు మోడీ కానుక*

*సైకిల్ పంపిణీ చేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి*

*జమ్మికుంట ఇల్లందకుంట జులై 22 ప్రశ్న ఆయుధం*

మోదీ కానుకగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినం పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం చేపట్టగా మంగళవారం రోజున కరీంనగర్ జిల్లా అపర భద్రాద్రి ఇల్లందకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఎంఈఓ కె రాములు నాయక్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కట్టంగూరు అనిల్ రెడ్డి బిజెపి మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి కలిసి పంపిణీ చేశారు అనంతరం బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోనీ ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి చదువుతున్న దాదాపు 20వేల విద్యార్థిని విద్యార్థులందరికీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సైకిళ్లను అందించడం గొప్ప విషయమన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాల లో 10వ తరగతి చదువుకునే విద్యార్థిని విద్యార్థుల ప్రయాణ రవాణా కష్టాలు తీరుతాయని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థినీ విద్యార్థుల ప్రయాణ రవాణా కష్టాల గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు మునుముందు ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కృషి చేస్తారని రానున్న రోజుల్లో విద్యార్థులకు మోడీ విద్యార్థి కిట్టును అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయప్రకాష్ బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పుల రమేష్, శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ కంకణాల సురేందర్ రెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు గుత్తికొండ రాంబాబు,కంకణాల రవీందర్ రెడ్డి నల్ల లింగారెడ్డి, తడిగొప్పుల రమేష్, బొమ్మాడి శ్రీధర్,మట్ట పవన్ రెడ్డి,తాళ్ల పాపిరెడ్డి, మురహరి గోపాల్,గుర్రాల సధాకర్ రెడ్డి,ఇంగ్లే రమేష్, చదువు సాయిరెడ్డి, మద్దూరి మల్లేష్,ఉప్పు దుర్గయ్య, కొక్కుల దేవేందర్, ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి, గురుకుంట్ల అనిల్ , తిప్పరబోయిన సమ్మయ్య,కోడం భరత్, చిప్పతి శ్రీకాంత్,శీలం సాయిప్రసాద్ రెడ్డి, భద్రయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment