త్వరలో ఏపీ పర్యటనకు మోదీ?
AP: కృష్ణా జిల్లా నాగాయలంక (మ) గుల్లలమోదలో క్షిపణి పరీక్షా కేంద్రం శంకుస్థాపనకు ప్రధాని మోదీ రానున్నారు. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు కోసం DRDO రూ.15-20వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఇక్కడ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అనుకూలమని 2011లోనే తేలింది. 2017లో భూకేటాయింపులు జరిగినా, మిగతా పనులు నిలిచాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో దీనిపై చర్చించగా, శంకుస్థాపనకు తానే వస్తానని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది.