*జమ్మూకశ్మీర్ ఘటన.. స్పందించిన మోదీ*
*Apr 22, 2025*
జమ్మూకశ్మీర్ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. సౌది అరేబియా పర్యటనలో ఉన్న ఆయన నడ్డా ఫోన్ ద్వారా అమిత్ షాతో మాట్లాడి దాడి వివరాలను తెలుసుకున్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తెలిపారు. అమిత్ షాను ఘటన స్థలానికి వెళ్ళాలని ఆదేశించారు. దీంతో అమిత్ షా ఉన్నత అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ దాడిలో మృతుల సంఖ్య 5కు చేరింది. మృతులు మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు.