Site icon PRASHNA AYUDHAM

*ప్రపంచ కోరుకుంటున్న మోదీ నాయకత్వం*

IMG 20250918 154800

నిజామాబాద్ సెప్టెంబర్ 18
(ప్రశ్న ఆయుధం)

ఇందూర్ నగరం : ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్బంగా సేవా పక్షంలో భాగంగా బిజెపి శ్రేణులు నిర్వహించిన స్వచ్ భారత్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా *అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ* పాల్గొనడం జరిగింది.

దేవి రోడ్ చౌరస్తా నుండి పాత గంజ్ కమాన్ వరకు ఎమ్మెల్యే గారు స్వయంగా రోడ్లను శుభ్రం చేసి, చెత్తను ట్రాక్టర్లో ఎత్తడం జరిగింది.

అనంతరం మహిళమోర్చ ఆధ్వర్యంలో అక్షరధామ్ పాఠశాలలో నిర్వహించిన చిత్రాలేఖనం, వ్యాసరచన పోటిల్లో పాల్గొన్ని ప్రతిభను కనపర్చిన విద్యార్థులకు బహుమతులు అందచేయడం జరిగింది.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు భారతదేశన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తు ముఖ్యంగా ఆర్ధిక, సాంకేతిక,రక్షణ రంగాలలో ప్రపంచ దేశాలలో విశ్వగురువుగా నిలబెట్టలనే సంకల్పంతో మోదీ అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు.

ప్రపంచ నాయకుడిగా మోదీ ఏదగడం భారతీయులుగా గర్వించదగ్గ విషయం అన్నారు. మోదీ లాంటి బలమైన నాయకత్వాన్ని ప్రపంచదేశాలు సైతం కోరుకుంటున్నాయని అన్నారు.

మోదీ జన్మదినం సందర్బంగా దేశవ్యాప్తంగా అనేక సేవకార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇందూర్ జిల్లా వ్యాప్తంగా కూడా అక్టోబర్ 2 వరకు ప్రతి గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి మోది కి బహుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు.

గత కొద్దీ రోజుల నుండి చెత్త నిల్వ ఉండటం పై మున్సిపల్ సిబ్బందిపై ఎమ్మెల్యే మండిపడ్డారు. రోజు చెత్తసేకరణ జరగాలని, చెత్త నిల్వలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version