మోడీ చిత్రపటానికి పాలాభిషేకం.

*కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పేద, మధ్యతరగతి రైతుల సంక్షేమానికి పెద్దపీట.*

– దేశ అభివృద్ధిని పరుగులు పెట్టించే చారిత్రాత్మక బడ్జెట్.

– బడ్జెట్లో అన్ని వర్గాల కు ప్రాధాన్యత.

* మోడీ చిత్రపటానికి పాలాభిషేకం.

* బీజేపీ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు

హుజురాబాద్ ఫిబ్రవరి 04

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ స్థితిగతినే మారుస్తుందని, బడ్జెట్ కేటాయింపులన్నీ వికసిత్ భారత్ లక్ష్యంగానే జరిగాయని , అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ చారిత్రక బడ్జెట్ ను ప్రవేశపెట్టారని బిజెపినాయకులు అన్నారు. బడ్జెట్ కేటాయింపులపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం రోజున బిజెపి హుజురాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా లో ప్రధాని మోడీ, చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు మాట్లాడుతూ బడ్జెట్లో అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా కేటాయింపులు జరిగాయన్నారు. ప్రధానంగా రక్షణ, విద్య, వైద్యం, వ్యవసాయం , స్కిల్ డెవలప్మెంట్ లకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, అందుకు తగిన విధంగా బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించారన్నారు. ముఖ్యంగా క్యాన్సర్ తో పాటు 36 రకాల ప్రాణాంతక వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ పై కస్టం డ్యూటీ నుంచిమినహాయించడంతో వాటికి సంబంధించిన మందులు ఇకపై చౌకగా లభిస్తాయన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడం, క్యాన్సర్ పేషెంట్లకు అవసరమైన మందులు చౌకగా లభించే విధంగా బడ్జెట్లోకేటాయింపులు జరపడం శుభపరిణామన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి మూడు లక్షల నుండి 5 లక్షల వరకు పెంపు, పప్పుధాన్యాల ఉత్పత్తికి సమృద్ధి పథకం, పండ్లు కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం ప్రారంభం చేయడం, పీఎం ధన్ ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టడం లాంటివి రైతాంగానికి ఎంతో తోడ్పాటునిస్తాయన్నారు. 50 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపులు చారిత్రకమైందని, బడ్జెట్ కేటాయింపులన్నీ అన్ని వర్గాలకు, ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందన్నారు.12 లక్షల వరకూ ఇన్కమ్ టాక్స్ లేదని తెలిసిన కోట్లాదిమంది ప్రజలు ఆనందంలో ఉంటే , ప్రతిపక్షాలు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేక దుఃఖంలో ఉన్నాయన్నారు .

ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, బిజెపి పట్టణ మాజీ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, గంగిశెట్టి ప్రభాకర్, నల్ల సుమన్, కొలిపాక శ్రీనివాస్, నరాల రాజశేఖర్, తిప్ప బతిని రాజు, సబ్బని రమేష్, యాళ్ల సంజీవరెడ్డి, పోతుల సంజీవ్, బోరగాల సారయ్య, మోలుగురి నగేష్, చింతల కిరణ్, బూత్ అధ్యక్షులు ఆవుల సదయ్య, రాజేష్ ఖన్నా, మోలుగురి రాజు, కొండల్ రెడ్డి, తాళ్లపల్లి దేవేంద్ర, సబ్బని మాధవి, మాడిశెట్టి చందర్, కుసుమ సమ్మయ్య, హృతిక్, తాళ్లపల్లి హరీష్, గంధం అనిల్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment