Site icon PRASHNA AYUDHAM

మోదీ పర్యటన.. 400 ప్రత్యేక బస్సులు ఏర్పాటు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

IMG 20250501 WA2494

మోదీ పర్యటన.. 400 ప్రత్యేక బస్సులు ఏర్పాటు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

May 01, 2025,

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. రేపు ప్రధాని మోదీ పున:శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా ప్రధాని పర్యటన నేపథ్యంలో తెనాలిలో ఆర్టీసీ, రవాణా ఏర్పాట్లపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రవాణా సౌకర్యాలు సమర్ధవంతంగా అందించేందుకు ఆర్టీసీ అధికారులు తగిన ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు. ఈ మేరకు 400 బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Exit mobile version