సొంత నిధులతో రోడ్డు వేయించిన మహ్మద్ అన్వర్

సంగారెడ్డి, ఆగస్టు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణంలోని 34వ వార్డులోని ఇందిరా నగర్ లో ప్రజల ఇబ్బందులను చూసి చలించి వార్డు నాయకుడు మహ్మద్ అన్వర్ తన సొంత నిధులతో మట్టి రోడ్డు వేయించారు. శనివారం అన్వర్ మాట్లాడుతూ.. చిన్న వర్షానికే నీరు నిలిచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొన్ని సార్లు వాహనదారుడు చిత్తడి వల్ల జారీ పడిపోవడం, చిన్న పిల్లలు పాఠశాలకు వెళ్లాలంటే వారిపై బురద చిత్తడం వంటి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందించినా.. వారు స్పందించకపోవడంతో తానే స్వయంగా తన సొంత నిధులతో రోడ్డు వేయించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రోడ్డు వేయించి తమ ఇబ్బందులు తీర్చిన మహ్మద్ అన్వర్ కు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు అమీర్, మహ్మద్ గౌస్, హమీద్ (అడ్డు), బాబా, రెహ్మాన్, ఇమాం సాబ్, అశోక్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now