శ్రీ సోమేశ్వర ఆలయ ఇన్ఛార్జ్ ఈవో గా మోహన్ బాబు..
పాలకుర్తి మండల కేంద్రం లోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామిఆలయ ఇంచార్జ్ ఈవోగా మోహన్ బాబు శనివారం బాధ్యత స్వీకరించారు. ప్రస్తుతం మోహన్ బాబు శ్రీ మత్స్యగిరి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ఈవోగా విధుల్లో ఉన్నారు. ఇప్పటివరకు పాలకుర్తి ఆలయ ఇంచార్జ్ ఈవోగా పనిచేసిన శ్రీ కోదండ రామస్వామి దేవాలయం నవాబుపేట ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న సెలవు పై వెళ్లగా, ఇంచార్జ్ ఈవోగా మోహన్ బాబు బాధ్యత స్వీకరించారు.