ఇస్రోజీవాడిలో పంటల పరిశీలన చేసిన జిల్లావ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి

ఇస్రోజీవాడిలో పంటల పరిశీలన చేసిన జిల్లావ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి

రైతులకు సలహాలు – పర్యటించిన జిల్లా వ్యవసాయ అధికారి

సస్యరక్షణ కోసం అధికారులు సూచనలు తీసుకోవాలని రైతులకు సూచన

రైతు వేదిక, గ్రామ పంచాయతీ, ఇందిరమ్మ ఇళ్లు, శానిటేషన్ పనుల పరిశీలన

రైతు నేస్తం కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు

ప్రశ్న ఆయుధం కామారెడ్డి, ఆగస్టు 8:

జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి శుక్రవారం ఇస్రోజీవాడి గ్రామంలో పర్యటించారు. పంటలను పరిశీలించి, రైతులు సస్యరక్షణ చర్యలపై వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని సూచించారు. అనంతరం గ్రామంలోని రైతు వేదిక, పంచాయతీ కార్యాలయం, ఇందిరమ్మ ఇళ్లు, శానిటేషన్ పనులను పరిశీలించారు.

ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ ఇ ఓ దేవేంద్ర, పంచాయతీ కార్యదర్శి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎల్. సుదర్శన్ రావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now