Headlines in Telugu:
-
డబ్బు కేవలం అవసరం మాత్రమే
-
డబ్బు యొక్క వాస్తవ విలువ
-
డబ్బు మన శక్తికి పరిమితి కాదు
-
డబ్బు కోసం మీ మనసును అమ్మకండి
-
మన శ్రేయస్సు కోసం డబ్బు గొప్ప పనిని చేయాలి
*_ఈ రోజుల్లో డబ్బు తోనే బంధువులు, బంధుత్వాలు,ప్రేమలూ,_ఆప్యాయతలు, గౌరవ మర్యాదలు అన్నీ దొరుకుతాయి._*
*_డబ్బుకున్న విలువ మనిషికి లేదు ఇది నాకే కాదు మీకు కూడా తెలుసు..పది మందిలో మన గౌరవాన్ని నిలబెట్టేది కూడాడబ్బే…అయినవాళ్ళ ముందు నిస్సహాయుకుడిగా నిలబెట్టేది కూడా డబ్బే.._*
*_అందుకే డబ్బుని గౌరవించండి.. పోయేటప్పుడు ఏం పట్టుకొని పోకపోయిన మనం పోయాక మన శవాన్ని తీయడానికి కూడా డబ్బే కావాలి కదా.._*
*_అందుకే అన్నారేమో..డబ్బుకి లోకం దాసోహం పైసా మే పరమాత్మ అని ఊరికే అనలేదు బహుశా ఇందుకేనేమో.._*
*_అంతెందుకు నాలుగు వెళ్ళు నోట్లోకి వెళ్ళాలన్నా..ప్రశాంతంగా పడుకోవాలన్నా ..నచ్చిన మనిషి మన పక్కన ఉండాలన్నా…మన దగ్గర ఉండాల్సింది ఖచ్చితంగా డబ్బే..కాబట్టి డబ్బుని గౌరవించండి..కానీ…_*
*_డబ్బే జీవితం అన్నట్టు బ్రతకకండి. మనిషికి డబ్బు ఎక్కువ ఉన్న ప్రశాంతత కరువవుతుంది. డబ్బు ఎక్కువైతే శత్రువులు ఎక్కువ అవుతారు. డబ్బు ఎక్కువైతే నీ సొంత కుమారుడే నీకు శత్రువుడిగా మారి నీకు మృత్యువు యొక్క రుచి చూపిస్తాడు._*
*_అందుకే డబ్బు అనేది ఒక అవసరం మాత్రమే. అంతేకానీ డబ్బు కొరకు అన్నిటిని వదిలేసి భగీరథ ప్రయత్నం చేయక్కర్లేదు._*
*_డబ్బు కొరకు నీఛాది నీచమైన పనులు చేయనక్కరలేదు. డబ్బు కొరకు నీ వ్యక్తిత్వాన్ని అమ్ముకోనక్కరలేదు. అదే డబ్బు కోసం నీ శీలాన్ని ఫణంగా పెట్టనక్కరలేదు._*
*_ఆశ అనేది అనంతమైనది. మనిషికి ఎంత డబ్బు ఉన్నా ఇంకా కావాలనే కోరిక మాత్రం చచ్చేదాకా వదలదు._*
*_అందుకే డబ్బు మనకు అవసరాలకు తగ్గట్టుగా ఉంటే చాలని నేనంటాను.. ఇంతకు మీరేమంటారు..?☝🏾_*
🙏🏾